Kodukaa Naa Mudhu Koduka Song | Madhu Priya Songs | Latest Folk Songs 2022 | Lalitha Audios & Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 3,2 тыс.

  • @ajaj2331
    @ajaj2331 2 года назад +542

    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    కడుపారాగన్న.. నీ కన్నతల్లినిరా..
    కనులారా చుద్దామనీ.. నేను కలెలెన్నో గన్నరా..
    నల్లనీ కాకమ్మతో.. చల్లంగా కబురంపా..
    కనుపడ్డోళ్లనీ అడిగినా.. కానరావయే కొడుకా..
    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    ఇంటి ముందు చింతచెట్టు..
    మీద కాకమ్మ కావు కావు మంటే..
    నా కొడుకే వస్తాడనుకొనీ..
    పాలుతెచ్చి పాశం మండుకుంటి..
    ఏ దారి చూసినా.. ఎవ్వరూ రారయే..
    ఆ పాశమన్నం పాశిపాయే..
    పాలబాకీ ఇంకా తీరదాయే..
    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    యడనన్న జాడదొరికితే..
    వేములాడబోతననని మొక్కిన..
    వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని..
    యాటపోతు తెచ్చుకున్న..
    ఎన్నిరోజులనీ నేనూ...
    ఎదురుచూడను కొడుకా..
    ఆ యటపోతు జెళ్లిపాయే..
    వేములాడ జాతర ఎళ్లిపాయే..
    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    చాయనలువుండేటోడు
    నా చక్కని చిన్నికొడుకు..
    ఎక్కడ లేవంటే..
    నేను ఏమనుకోను కొడుకా..
    అన్నలా కొరకు కొడుకూ..
    అడవికిబోయిడేమో..
    వెన్నలగన్న కొడుకుకు..
    వెన్ను తట్టి దారిచూపు..
    కొడుకా నా ముద్దు కొడుకో..
    కొడుకా ఓ చిన్ని కొడుకా..
    ఎక్కడబోతివిరా..
    నేను ఒక్కదాన్నయితిరా..
    అన్నల్లో గలిసిపోయే.. కొడుకా
    అదృష్టమందరికీ రాదూ..
    అన్యాయాన్ని ఎదురించినట్టి
    అమరుల్ల బాటల్లో నడువు..
    అమరుడు పెద్దన్నబందుకు..
    అందుకొనీ ముందుకురుకు..
    నీకు బరువైతే చెప్పు కొడుకా..
    నా బలమిస్త వంతు కొడుకా..
    నీకు బరువైతే చెప్పు కొడుకా..
    నా బలమిస్త వంతు కొడుకా..
    నీకు బరువైతే చెప్పు కొడుకా..
    నా బలమిస్త వంతు కొడుకా..

  • @Galiakshay
    @Galiakshay 2 года назад +5399

    మళ్ళీ అన్నలు రావాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు

  • @mahi7082
    @mahi7082 Год назад +222

    నీకు బరువైతే చెప్పు కొడుకా na బలమిస్తా చిన్ని కొడుకా.... Awesome finishing 🤗🤩

  • @voiceofshastrala
    @voiceofshastrala 2 года назад +127

    ఇంతకుముందు పాట ఏ విధంగా ఉందో ఈ పాట కూడా మొత్తం అదే విధంగా ఉంది ఇంత మంచిగా పాట పాడిన మధుప్రియ కు కృతజ్ఞతలు

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +745

    మళ్లీ అన్నలు వస్తే బాగుండు🚩🚩✊✊. ఈ దిక్కుమాలిన అరాచక పరిపాలన పోవాలి. లాల్ సలామ్ 🚩🚩✊✊

    • @naveennanisounu7623
      @naveennanisounu7623 2 года назад +15

      🙏🙏

    • @parameshwarkuntala2570
      @parameshwarkuntala2570 2 года назад +13

      Ssss anna

    • @avishchandramasade6570
      @avishchandramasade6570 2 года назад +9

      లాల్ సలాం కామ్రేడ్ ✊✊
      మునుపటి లెక్క అన్నల్లో నిజాయతీ,ఐకమత్యం లేవు లోపించినాయి
      కొందరు మాత్రమే నిఖర్సుగా ఉన్నారు చాలా మంది స్వార్థ ప్రయోజనాల కోసమే ఉన్నారు

    • @ninginelacreations
      @ninginelacreations 2 года назад +5

      @@avishchandramasade6570 నిజమ అన్న గారు 🚩✊

    • @nerellaraju534
      @nerellaraju534 2 года назад +20

      అన్నలు రావాలి అంటే..
      వాళ్ళు ఆకాశం నుండి రారు...
      ప్రజలనుండే వస్తారు.....
      నిజంగా అరాచకపు పాలన పోవాలని ఉంటే
      నువ్వే పోరాదు మరే...?
      ఎవరో త్యాగం చెయ్యాలి మనం మాత్రం ఇంట్లో సుఖంగా ఉండాలి.....
      జై హింద్...

  • @nareshmulka5876
    @nareshmulka5876 2 года назад +37

    ఒక ఉద్యమం మళ్లీ పుడుతుంది ఆ ఉద్యమమే ఉధృతమై మళ్ళీ వస్తుంది కచ్చితంగా సమ సమాజ నిర్మాణానికి మళ్లీ పురుడు పోసుకుంటుంది ఈ ఉద్యమం ఉద్యమంలో అసరులు బాసిన అమరులకు వందనం అభివందనం....

  • @mogilitatipudi6961
    @mogilitatipudi6961 2 года назад +373

    దేవరకొండ బిక్షపతి అన్న అద్భుతమైన రచన. మధుప్రియ ప్రాణం పెట్టి పాడిన పాట. లలిత ఆడియోస్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏. అలాగే బిక్షపతి అన్న కళాకారుల గురించి రాసిన పాట కూడా వెలుగులోకి తేవాలని మనవి. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ వుంటది అది నిజమోలే. ఈ పాటను వెలుగులోకి తేవాలని ప్రార్థన.

    • @LalithaAudiosAndVideos
      @LalithaAudiosAndVideos  2 года назад +28

      ఈ పాట షూటింగ్ అవుతుంది బ్రో 5దయ్స్ లో ప్రోమో వొస్తుంది .ధన్యవాదలు

    • @agniveshofficial8412
      @agniveshofficial8412 2 года назад +5

      Channel link pettandi anna

    • @pandusiddharth2258
      @pandusiddharth2258 2 года назад +2

      @@LalithaAudiosAndVideos 🙏🙏💐💐

    • @agniveshofficial8412
      @agniveshofficial8412 2 года назад +2

      @@LalithaAudiosAndVideos link pettandi anna

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 2 года назад +3

      మధుప్రియ ప్రాణం పెట్టిందా? అంటే ఇప్పుడు మధుప్రియ కు ప్రాణం లేనట్టేనా😄.

  • @youngstardeva4498
    @youngstardeva4498 Год назад +163

    అన్నల్లో కలిసిపోయే అదృష్టం అందరికి రాదు...... చాలా బాగుంది 🙏🙏

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 года назад +88

    అన్నల్లో కలిసిపోయే కొడుకా..అదృష్టం అందరికి రాదు..అన్యాయాన్ని ఎదిరించే అమరుల బాట నడువు.. లైన్ చాలా బాగుంది...🙏🙏
    విప్లవం వర్ధిల్లాలి...🙏🙏. మధుప్రియ గొంతుతో ఈ పాట వినాలని ఉండే... ఇప్పుడు ఆ కోరిక తీరింది... పాట రచించిన బిక్షపతి అన్నకి అమర నివాలుల వందనాలు..🙏🙏

  • @కొమ్ముశ్రీకాంత్

    మీ టీం మొత్తానికి ధన్యవాదాలు మళ్ళీ ఈ పాటని మా మధ్యలోకి తీసుకొని వొచ్చినందుకు 👏👏

  • @mohansabavath8279
    @mohansabavath8279 Год назад +114

    ప్రాణం పెట్టి పాడింది 👌👌👌👌👍..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....

  • @mnagaraj4762
    @mnagaraj4762 Год назад +89

    2024 లో వినేవాళ్ళు ❤

    • @chinnaVJ778
      @chinnaVJ778 8 дней назад

      I'm listening in 2025k also ❤

  • @janivinay4535
    @janivinay4535 2 года назад +77

    ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటునాయి, మధుప్రియ నువ్వు ప్రాణం పెట్టీ పాడావు, నీ వాయిస్ కి ఎంత చెప్పినా తక్కువే, ఈ పాటలో లాస్ట్ చరణం వింటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @busarajkumar4286
    @busarajkumar4286 2 года назад +43

    ఈ పాపకు సమాజంలో అన్నలు ఉండాలి లేకపోతే ఇంకా మనదేశంలో అవినీతి అక్రమ జరుగుతూ ఉంటుంది జై అన్నలు జై భీమ్ కొమరం భీమ్

  • @AareenAsareen
    @AareenAsareen 9 месяцев назад +37

    లాల్ సలాం కామ్రేడ్స్ ఇలాంటి మంచి ఇంకెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నలు మళ్ళీ ఉండాలి ఈ నియంత పాలన జరుగుతుంది కాబట్టి అన్నలు ఉంటేనే ప్రజాస్వామ్యగంలో ప్రజలందరూ బాగుంటారు లాల్ సలాం కామ్రేడ్స్ మీ వాసంపెల్లి చైతన్య మాదిగ

  • @dhojthakur1184
    @dhojthakur1184 2 года назад +72

    ఎంతో అద్భుతంగా రాసిన ఈ పాటకు శతకోటి వందనాలు

  • @pulledhulachakrichakri3383
    @pulledhulachakrichakri3383 2 года назад +75

    నా కొడుకే వస్తాడని పాలు తెచ్చి పాయసం వడితిని..... ఇది నా heart కి full గా touch చేసింది... మా అమ్మ గుర్తొచ్చింది😢

  • @Sairam-smiley
    @Sairam-smiley Год назад +21

    ఈ పాట నీ గొంతుతో వినాలని చాలసార్లు అనుకున్న విన్న థాంక్స్ మధుప్రియ

  • @vinay2536
    @vinay2536 2 года назад +54

    ఇలాంటి పాట కి రూపం కల్పించిన మధు ప్రియ గారికి ఈ పాట రచయిత అయిన భీక్షపతీ అన్న కి విప్లవం వందనములు🙏🙏

    • @JoguChenna
      @JoguChenna Год назад

      ఈ పాట అశ్విని పాట

  • @kolli.gayathrigayathri2038
    @kolli.gayathrigayathri2038 2 года назад +45

    నేను ఒక్క 💯 సార్లు విన్నా ఇంకా విన్నలి అనిపిస్తుంది అంత బాగుంది పాట ఈ పాట రాసిన వారికి 🙏🙏 ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అని కోరుకుంటున్న మధు ప్రియ గారు మీ గొంతు అంత బాగుందో సూపర్ సాంగ్

  • @Rajshekarbillakanti
    @Rajshekarbillakanti Год назад +276

    మృగాలు సమాజాన్ని పాలించినపడు.... ఆడివిలో ఎర్ర జెండాలు ఎగురుతాయి.... ✊

  • @rameshmanda642
    @rameshmanda642 2 года назад +56

    బిక్షపతి అన్న రాసిన పాట సాహిత్య రంగంలో ఒక వరవడినిసృష్టించింది దానికి కొత్తదనం తెచ్చే మ్యూజిక్ మరియు మధుప్రియ గానం మధురంగా ఉంది ఈ పాటను మళ్లీ తీసుకొచ్చిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ కి ప్రత్యేక వందనాలు

  • @prashanthmamidipelli2120
    @prashanthmamidipelli2120 2 года назад +195

    నా కోరిక అన్నల్లో కలిసిపోవాలని...!✊
    కానీ ఆ అదృష్టం అందరికీ రాదు..😭

    • @kashaminanaveenkumar6368
      @kashaminanaveenkumar6368 2 года назад

      Correct bron

    • @nayominyatha5671
      @nayominyatha5671 Год назад +1

      S brother

    • @rajeshakarapu5351
      @rajeshakarapu5351 Год назад +5

      No thammudu..singer,music director,cameramen.liricist,lighiting dipartment ..... Ei song lo palgunnavallu okkaru cherina nuv cheru... It's a private song for own business ...I hope u understand...

    • @nanigamer6793
      @nanigamer6793 Год назад +1

      😢

    • @prashanthmamidipelli2120
      @prashanthmamidipelli2120 Год назад +6

      @@rajeshakarapu5351 ఎవరో చేరుతారని నేను చేరను మిత్రమా...! నాకు చేరాలని ఉంది కాబట్టి నా మనుసులో మాట చెప్పా..

  • @Maheshjetti_official
    @Maheshjetti_official 11 месяцев назад +260

    2024 లో వినేవాళ్ళు ఒక like pls

  • @prashanthpeddi5761
    @prashanthpeddi5761 2 года назад +156

    కొన్ని పాటలు వింటుంటే మనలో మనకు తెలియని బలం తెలుస్తుంది. చాలా మంచి పాట.

  • @freedomworld2295
    @freedomworld2295 2 года назад +176

    అల్లి పోదల కాడ అన్నలున్నారో
    అల్లి పొదల కాడ
    అల్లి పోదల కాడ అన్నలున్నారో
    అల్లి పొదల కాడ.
    ఈ పాట కూడా పాడండి దయచేసి
    ఈ పాటలు మన తెలంగాణ బిడ్డలను ధైర్యంగా ముందుకు నడిపించడానికి బాటలు వేయాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
    ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టం❓️
    మీలో ఈ పాట యూట్యూబ్ లో రావాలని ఎంతమంది కోరుకుంటూన్నారు ప్లీజ్ లైక్ 👍🏻
    🙏🏻🙏🏻🙏🏻

  • @srikanthsrikanthmanne9501
    @srikanthsrikanthmanne9501 Год назад +85

    అన్యాయం ని ఏదిరించి ప్రాణాత్యాగం చేసిన ప్రతి అన్నలకు లాల్ సలాం 😢😢

  • @sureshofficial9126
    @sureshofficial9126 2 года назад +176

    నీకు బరువైతే సెప్పు కొడుకా.. నా బలమిస్తా పట్టు కొడుకా.. వాహ్ .. ఏమన్న లిరికా ఇది. నాకైతే goosebumps.. 🎉🎉

  • @perlaganesh8764
    @perlaganesh8764 2 года назад +710

    నా గురువు దేవరకొండ బిక్షపతి అన్నగారికి కన్నీటి 😭 వీడ్కోలు విప్లవ జోహార్లు కామ్రేడ్ బిక్షపతి అన్న 🙏 బిక్షపతి అన్న అంటే ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి 🙏

  • @sridharthipparthi
    @sridharthipparthi Год назад +20

    మరోసారి మానుకోట పాట దమ్ము చూపించింది ❤❤

  • @ganeshnayak9406
    @ganeshnayak9406 2 года назад +173

    అన్నల్లో కలిసి ప్రజలకోసం ప్రజసమ్యాం తో పోరాడే అదృష్టం ఎవరికి రాదు అన్న.... లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩

  • @Sainathsirmudhiraj0606
    @Sainathsirmudhiraj0606 2 года назад +697

    అన్యాయం ఎదిరించే ప్రతి వాడు "అడవిలో అన్న"నే లాల్ సలామ్ కామ్రేడ్🚩✊

  • @chaitumahi8331
    @chaitumahi8331 11 дней назад +3

    సూపర్ అమ్మ
    పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఎక్సలెంట్

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 года назад +748

    మధు ప్రియా వాయిస్ ఎంతమందికి నచ్చింది..... 🤩

  • @someshwarraparthi7829
    @someshwarraparthi7829 2 года назад +33

    ఈ పాట నేను చిన్నతనంలో ఉన్నపుడు రోజు మా అమ్మ పడేది మళ్ళీ చాలా రోజులు తరువాత విన్నక మళ్ళీ చిన్ననాటి గుర్తుకు వచ్చాయి
    మధుప్రియ voice బాగుంది nd e పాటని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు

  • @chebarthyrajashekharars8730
    @chebarthyrajashekharars8730 Год назад +14

    ఈ పాట విన్నప్పుడల్లా నా తమ్ముడు (బంటి ) గుర్తుకువస్తాడు😭😭 చాలా అద్భుతంగా పాడారు

  • @alvalanaresh9440
    @alvalanaresh9440 2 года назад +19

    Neeku bharuvu ithe cheppu naa balamistha lyric 🙏🏽🔥very emotional 😭 madhu pranam petti padindhi♾️❤️

  • @upendar6084
    @upendar6084 2 года назад +32

    ఈ ఆవేదన అమ్మ ఒక్కదానిది కాదు! ప్రజా పోరాటానికి, తమ పిల్లలను అరణ్యానికి అంకితం ఇచ్చిన ప్రతి తల్లి ఆవేదన!!
    Spl thks vinod garu👍

  • @ashokthogari8901
    @ashokthogari8901 Год назад +7

    EXCELLENY LYRICS,SUPER MUSIC AND BEST SINGING MADHU PRIYA

  • @prashanthvibhoothi5898
    @prashanthvibhoothi5898 2 года назад +1356

    2023 లో కూడా ఈ పాట🎵🎶🎤 వినే వారు ఒక్క ❤ ప్లీజ్

  • @maheshmahi-ig1ih
    @maheshmahi-ig1ih 2 года назад +51

    మల్లి అన్నలు రావాలి అన్నలు వస్తేనే బాగుంటుంది ఈ సమాజం లో జై లాల్ సలాం ✊️✊️✊️🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @comrades_9
    @comrades_9 11 месяцев назад +2

    విప్లవ బాటలో నడిచింది మొదలు, రాతి కొండల్లో ఉదయించే సూర్యుడిలా, పచ్చని అడవులె కుటుంబంగా, అలుపెరుగని ఆలసిపోని పోరాటానికి బందుక్ని పట్టి మంచికై సాగిన నది ప్రవహలుగా , నుదుటిన బొట్టులా ఈ ఆడవితల్లికి పెద్ద బిడ్డలైన,మన విప్లవ సైనికులకు లాల్ సలాం,మన విప్లవ వీరులకి జోహార్లు 🌹
    #విప్లవం వర్ధిల్లాలి #కమ్యునిజం #సిపిఐ (M)

  • @Devannnn-q8i
    @Devannnn-q8i 2 года назад +40

    ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాం♥️

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 2 года назад +753

    లాస్ట్ చరణం కోసం విన్నవాళ్ళు ఒ లైక్ వేసుకోండి

  • @itssravan883
    @itssravan883 2 года назад +1046

    అన్నల్ల కలిసే పోయే అదృష్టం అందరికీ రాదు

  • @athishivaprasad3658
    @athishivaprasad3658 2 года назад +63

    మేడం మధు ప్రియా గారు నీవు ఈ పాటను ప్రాణం పెట్టి పాడడం వల్లనే, నేను వింటుంటే ఇంత మధురంగా ఉంది, ఇంత మంచి పాటను మాకు అందించిన మధుప్రియ మేడం గారికి మరియు ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు💐💐💐

  • @charakondakurumaiah4839
    @charakondakurumaiah4839 Год назад +4

    నీ గొంతు నుండి జాలువారే ఏ పాట అయినా అమోఘం... నీ పాటలు వింటుంటే మనసుకు ఏదో తెలియని హాయి గా అనిపించే విధంగా గుండెకు హత్తకుపోతుంది నీ పాట..❤❤❤

  • @manthanagaraju2974
    @manthanagaraju2974 2 года назад +111

    సూపర్ మధుప్రియ గారు ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న గుర్తుకు వస్తాడు మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు కానీ ఈ పాట వింటే ఎర్రజెండాలో కనిపిస్తా అలాంటి అన్నలు లేక దొంగ రాజకీయాలు నడుస్తున్నాయి

    • @cnrajulogics1514
      @cnrajulogics1514 2 года назад +3

      Don't worry bro v r there to remember everything

    • @rameshvelpula4842
      @rameshvelpula4842 2 года назад +1

      Proud of your father brother

    • @its_maahi_vay
      @its_maahi_vay 2 года назад

      🙏🙏🙏

    • @muneshbabu9654
      @muneshbabu9654 Год назад

      బ్రో ఏమి ఫీల్ అవ్వకు అన్న ... నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు .. అన్న.. నాన్న మన దగ్గర ఉన్నాడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఏదైనా బరువు అయినప్పుడు ని దగ్గర ఉంటారు అన్న .. నీకు ఒక brother unnadu anuko anna ... 😮😢

    • @vittalboggula5561
      @vittalboggula5561 Год назад +1

      😭😭😭😭😭

  • @mmblove7989
    @mmblove7989 2 года назад +44

    ఎన్ని సార్లు విన్న.. మళ్ళి మళ్ళీ వినాలనిపిస్తుంది.. సూపర్ సాంగ్👏🙏

  • @pulimelakoti5434
    @pulimelakoti5434 8 месяцев назад +6

    ఆడపిల్లనమ్మా అనే పాట తరువాత మీరు పాడిన పాటలలో ఈ పాట అద్భుతం.👌👌👌👌

  • @boddupallishankar
    @boddupallishankar 2 года назад +331

    ప్రాణాలను సైతం త్యాగం చేసి అన్యాయాన్ని ఎదురించిన అన్నలందరికి లాల్ సలాం కామ్రెడ్స్..🚩🚩✊✊

  • @rameshkampati25
    @rameshkampati25 2 года назад +58

    సాంగ్ వింటే ఏడుపు వస్తుంది అక్క 👌👌heart టచింగ్

  • @talarivenkatesh3868
    @talarivenkatesh3868 25 дней назад +1

    ప్రాణం పెట్టి పాడిన మధు ప్రియ గారికి పాదాభివందనం

  • @kolli.gayathrigayathri2038
    @kolli.gayathrigayathri2038 2 года назад +166

    అన్నలు మళ్ళీ రావాలి అని అంత మంది కోరుకుంటున్నారు జై కామ్రేడ్ ✊

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 2 года назад +31

    అన్నల్ల కలిసిపోయే అదృష్టం అందరికీ రాదు
    చాలా బాగుంది అన్న సాంగ్
    మధుప్రియ వాయిస్ సూపర్ అన్న

  • @vijaypailwan932
    @vijaypailwan932 Год назад +8

    Waaa supar song and supar singing madhu Priya garu❤👏👏👏

  • @RamPrasad-qb2hv
    @RamPrasad-qb2hv 2 года назад +57

    మహబూబాబాద్ కి పాటల రూపం లో మంచి పేరు ను తెచ్చి పెట్టిన లలిత ఆడియో వారికి కృతజ్ఞతలు

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 2 года назад +23

    అన్నంలో కలసిపోయి.... ఆ చరణాలు నా గుండెను పిండేసినాయి..... సూపర్ సాంగ్....💖💖😍😍 మధుప్రియ 👌👌👌

    • @srinul8580
      @srinul8580 Год назад

      🎉🎉🎉🎉😢❤❤❤😢😢😢

    • @srinul8580
      @srinul8580 Год назад +1

      S rinu

  • @pangipaasad4108
    @pangipaasad4108 Год назад +7

    చాలా చాలా బాగుంది 🎉🎉ఎంత చేపైన విన్నలని అని పిస్తుంది ❤❤

  • @etikalaswamy6769
    @etikalaswamy6769 2 года назад +73

    పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి 👍👍👍

  • @maluajmeera487
    @maluajmeera487 2 года назад +35

    లలిత ఆడియో నుంచి ...చాల రోజుల తరవాత మంచి పాటను వింటున్న...ధన్యవాదాలు అన్నగారు..మీ ప్రయాణం ముందుకు సాగాలి......all the best...... అన్నగారు.........మీ.ఆజ్మీర మాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా.రేవంత్ సైన్యం జిల్లా ఇన్చార్జ్....

  • @munnabhai-pm5if
    @munnabhai-pm5if Год назад +48

    2023 విన్నావాలో ఒక లైక్ చేయండి ప్లీజ్

  • @veerababuandem4754
    @veerababuandem4754 Год назад +8

    ఇది చాలా ఓల్డ్ సాంగ్... మళ్ళీ ఇది మధు ప్రియా
    పాడింది... అప్పుడు... అశ్విని అక్క... సాంగ్ nice సాంగ్... కొన్ని వేల సార్లు విన్న ఈసాంగ్.... కానీ మధుప్రియ సూపర్ పాడింది...

  • @sureshpunnamala5190
    @sureshpunnamala5190 2 года назад +64

    పాశమన్నం పాసిపాయె
    పాలబాకీ తీరదాయే.....!
    మనిషి మనసు మాటు చీకటిని కదిలించు మాట 🙏🙏🙏

  • @mharinaik8907
    @mharinaik8907 Год назад +14

    నీకు పాదాభివందనాలు మధు ప్రియ అక్క 🙏🙏🙏

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 2 года назад +21

    మీకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను

  • @NaaBangaruThalli8262
    @NaaBangaruThalli8262 2 года назад +21

    🙏🙏ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మరియు సోదరి మధుప్రియ చాలా అద్భుతంగా పాడింది. కానీ అడవికి పోయి తుపాకీ పట్టుకొని పోరాటం చేసే రోజులు కావు ఇవి ,ఒకసారి తుపాకీ పట్టిన తర్వాత ప్రాణం పోవడం తప్ప మరో దారి లేదు,ఒకప్పుడు తుపాకీ పట్టి చేసిన యుద్ధం కొంత వరకు సత్పలితాలను ఇచ్చి నప్పటికీ ,ఆ యుద్ధంలో ఎందరో బిడ్డలు అసువులు బాసారు ,కనీసం వాళ్ల శవాన్ని కూడా చూసే భాగ్యం లేని ,ఆ భాగ్యానికి నోచుకోని తల్లిదండ్రులు ఎందరో......వాళ్ళ కన్నీళ్లకు సమాధానం చెప్పేవారు ఇప్పటికి లేరు.ప్రజల్లో ఉంటూ ప్రజాస్వామ్య యుతంగా పోరాటం సాగించాలి తప్ప తుపాకీ పట్టి అడవికి పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పాట ఎంతో శక్తివంతమైనది,ఈ పాటకు ప్రభావితమై ఎవరు wrong decision తీసుకోవద్దు అనేది నా ఆలోచన 🙏🙏🙏

    • @srikanthyadavpanduga1819
      @srikanthyadavpanduga1819 2 года назад +1

      అవును అన్న మీరు అన్నతున్నది నిజమే కాని ఈ రాజకీయ నాయకులు ఆడవి లో ఉండే అన్నలకే. భయపడతారు ఈ పోలీసు లను కానీ e చట్టాలను చూసి భయపడరు వాళ్లు ఉన్నపుడు రాజకీయానికి ఇప్పుడు ఉన్న రాజకీయనికి చాలా తేడా ఉంది మళ్ళీ వాళ్లు రావాలి e రాష్ట్ర రాజకీయం మారాలి

    • @NaaBangaruThalli8262
      @NaaBangaruThalli8262 2 года назад +2

      @@srikanthyadavpanduga1819
      మీరన్నది నిజమే ....అప్పటి భయం రాజకీయ నాయకులకు లేదు అనేది నిజం బ్రదర్, కానీ మంచి రాజకీయాలు చేసే నాయకులు కూడా కొందరు కనిపిస్తున్నారు అలాంటి వారికి సపోర్ట్ చేసి ఇప్పుడున్న రాజకీయాలను ఎదుర్కోవాలి .అడవికి పోయి యుద్ధం చేసి ప్రాణాలతో మిగిలే పరిస్థితి లేదు మిత్రమా.....కొందరు విద్యార్థులు తెలిసి తెలియక అడవికి వెళ్లి ఎన్కౌంటర్ లో శవమైన దాకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ టెక్నాలజీ యుగంలో అడవిలో తుపాకీ పట్టి పోరాటం చేసే పరిస్థితి లేదు,యువకులు రాజకీయాల్లోకి రావాలి రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయాలి.ఆయుధం ఎప్పటికి రక్తపాతాన్నే కోరుకుంటోంది.నా msg కి స్పందించినందుకు ధన్యవాదాలు🙏

    • @srikanthyadavpanduga1819
      @srikanthyadavpanduga1819 2 года назад +1

      @@NaaBangaruThalli8262 ఇప్పుడు ఉన్న యువత. ఉన్న సమయాన్ని కొంత గర్ల్స్ కోసం ,కొంత సమయాన్ని చదువు కోసం, కొంత సమయాన్ని ,భవిషత్తు కోసం కేటాఇస్తు బిజీ ఉంటే ఈ రాజకీయ నాయకులు దోచుకోవడం లో బిజీగా ఉన్నారు

    • @NaaBangaruThalli8262
      @NaaBangaruThalli8262 2 года назад

      @@srikanthyadavpanduga1819
      😂😂మీరన్నదాంట్లో...నిజం ఉంది
      అందరూ అలాగైతే ఉండరు కదా...?

  • @s.prakash6431
    @s.prakash6431 Год назад +10

    చాలా బాగా పాడారు అక్క❤❤💯💯

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 2 года назад +230

    భిక్షపతన్నకు ఉద్యమాభివందనాలు ✊✊✊✊✊✊🚩🚩🚩🚩ప్రజలకు ఈ పాట పరిచయం చేసిన అశ్విని కి లాల్ సలాం🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gorupallykumar7028
    @gorupallykumar7028 2 года назад +40

    సూపర్ సాంగ్ మధుప్రియ గారు మీ వాయిస్ చాలా బాగుంది అన్నంలో కలిసిపోయే అదృష్టం అందరికీ రాదు అక్క

  • @gopi4980
    @gopi4980 Год назад +3

    ఈ పాట రాసిన వారికి, పాడిన మధుప్రియ గారికి, music play చేసిన వారికి, song కోసం ఇంత కస్ట పడ్డ అందరికి నా కృతజ్ఞతలు...❤

  • @neverevermelody7665
    @neverevermelody7665 2 года назад +12

    ilanti songs marenno raavali ani korukuntu thanks to lalitha audios and videos channel we are waiting for this type songs

  • @rambaaki
    @rambaaki 2 года назад +134

    విప్లవం వర్ధిల్లాలి ✊🏻
    లాల్ సలాం భిక్షమన్నకు 🚩
    ప్రాణం పెట్టి పాడిన మధుప్రియకు 🙏🏻
    _________FROM: బాకి_________

  • @kondramallesh2246
    @kondramallesh2246 Год назад +6

    పాట రాసిన bixapati అన్న గారికి పాదాభివందనం నమస్తే

  • @sharpoddinshek9153
    @sharpoddinshek9153 Год назад +192

    ఈ పాట రాసిన వారికి అదేవిదంగా పాట మ్యూజిక్ కంపోజ్ చేసినవారికి ముఖ్యం గా గానం ఆలపించిన మధుప్రియ గారికి 👌👌🙏🙏🙏 ఈ పాట గుండె బరువైన వారికి అశృనివాళి అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్

  • @sai_kiran2946
    @sai_kiran2946 2 года назад +14

    Super Lalitha audios madhu Priya akka super gaa padaaru🥰

  • @mudampelliram6074
    @mudampelliram6074 2 года назад +34

    విప్లవ వీరుల గురించి అద్భుతంగా పాడిన మధుప్రియ గారు , మంచి సంగీతం ,రచన, దర్శకత్వం, చేసిన మీ టీమ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతోమంది విప్లవం కోసం పోరాడిన విప్లవ వీరులకు పాదభివందనాలు . అలాగే విప్లవ వీరులను కన్న మాతృమూర్తులకు ధన్యవాదాలు . ఈలాంటి మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను . విప్లవ వీరుల కథలు నేటి తరానికి ఎంతగానో అవసరం ఉంది . ఎంతో మంది అమరులైన, మరియు విప్లవంలో ఉన్నందరికి లాల్ సలామ్ 🚩✊ విప్లవం వర్ధిల్లాలి✊🚩

  • @ganilovebeats4553
    @ganilovebeats4553 2 года назад +33

    మధు ప్రియ వాయిస్ కి ఒక లైక్ 👍🏻

  • @kumarnayak2574
    @kumarnayak2574 Год назад +7

    పాట వింటున్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి 😢😢

  • @maheshpochampally
    @maheshpochampally 2 года назад +26

    దాదాపు ఒక15 పైనే అవుతుంది ఈ పాట విని అప్పట్లో పాడిన ఆ సింగర్ గారికి మరియు ఈ సింగర్ కి ధన్యవాదాలు

  • @KhammamVenky
    @KhammamVenky 2 года назад +26

    అన్ని పాటలో
    కొన్ని పాటలు మాత్రమే
    చరిత్ర లో నిలుసాయి
    అందులో ఈ పాట 🙏ఒకటి

    • @velakamramudu
      @velakamramudu 6 месяцев назад

      లింగయ్య పాట వినండి చాలా బాగుంటుంది... కామ్రేడ్ లింగయ్య గుండాల మండలం

  • @budidasagar4653
    @budidasagar4653 Год назад +2

    Neeku baruvaithe cheppu koduka na balamistha koduka....some meanings no words to explain....really great to hear....for writer and singer 🙏🙏🙏🙏

  • @ankamsrikanth3151
    @ankamsrikanth3151 2 года назад +15

    నీకు బరువైతే చెప్పు కొడకా నా బలమిస్తా ముద్దు కొడకా.....🙏🏻 థాంక్స్ వినోద్ అన్న ఈ సాంగ్ మళ్లీ ట్రెండింగ్లకి వస్తుంది అనుకోలేదు...😍

  • @nagarajuyoutubar
    @nagarajuyoutubar 2 года назад +23

    ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు

  • @kampallyganesh1642
    @kampallyganesh1642 10 месяцев назад +3

    రోజు ఈ పాటను 2 , 3 సార్లు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🤗

  • @dileepdilu8725
    @dileepdilu8725 2 года назад +20

    5:20 to 5:51 wow what a lyrics , what a feel.....superb singing.....❤️❤️❤️🤗🤗🤗🤗 goosebumps

  • @kkmedia38
    @kkmedia38 2 года назад +7

    బిక్షపతి అన్న నేను మంచి మిత్రులం అన్న గురించి బాగా తెలిసిన వాళ్లలో నేనొక్కడినీ ఇప్పుడు అన్ని కుటుంబం చాలా బాధలో ఉంది దయచేసి అన్నకు ఒక కొడుకు అన్న లేడు, మనందరం అన్న కోసం ఏదైనా చేద్దాం ఆ కుటుంబానికి అన్న చనిపోయిన రోజు కర్మకాండలో భాగంగా చెరువులో స్థానానికి వెళ్లి అన్న కర్మ రోజు వాళ్ళ నాన్నగారు చెరువులో మునిగి చనిపోవడం జరిగింది, మగ దిక్కు ను కోల్పోయిన కుటుంబానికి అన్న పాటనీ అభిమానించిన ప్రతి ఒక్కళ్ళు అండగా ఉండటమే అన్నకు నిజమైన నివాళి

  • @motherameshsinger2926
    @motherameshsinger2926 4 месяца назад +2

    మీరు ఇంత అద్భుతంగా పాడిన కానీ అశ్విని పాడినట్టు ఈ పాటలో ఫీలింగ్ రాలేదు

  • @minnycreation2592
    @minnycreation2592 2 года назад +9

    ఈ పాట నా 12 year ముందే విన్నాను మళ్ళీ ఇప్పుడు విన్నాను
    అందరికోసం ఈ పాటని మళ్ళీ మీరు ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు

  • @kanakaiahpulla5181
    @kanakaiahpulla5181 2 года назад +53

    జైయాహో సంబశివుడు జోహార్...జోహార్...✊✊✊

  • @jilakaramahesh8333
    @jilakaramahesh8333 5 месяцев назад +3

    సూపర్ గా పాడారు.చరిత్రలో నిలిసిపోతుంది.👌🏻

  • @RameshvemulapalliRameshvemulap
    @RameshvemulapalliRameshvemulap 2 года назад +51

    మీరు పాడిన ఇ పాట వింటే చాలు ఈ జన్మకు సార్థకత లభిస్తుంది

  • @ajaybeatzofficial6210
    @ajaybeatzofficial6210 2 года назад +8

    Mali backup ga e song chesinaduku TQ lot
    enka chalaa songs unnaye avee anee andriki telvale pls try to make avee kudaa
    A special tq to Madhu Priya Akka ❤️

  • @vasuperla3678
    @vasuperla3678 Год назад +4

    ప్రజల గుండె చప్పుడే కామ్రేడ్స్ లాల్ సలాం 🙏

  • @rajumanthepuri7404
    @rajumanthepuri7404 2 года назад +88

    అన్నలు ఉన్నారు మన చుట్టూ మన మధ్యలోనే అన్ని గ్రహిస్తూనే ఉన్నారు టైం వచ్చినప్పుడు కనిపిస్తూనే ఉంటారు 🙏🙏🙏

  • @mahajanatv
    @mahajanatv 2 года назад +9

    ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్ది మళ్ళీ అందించిన లలిత ఆడియోస్ ఎంటైర్ టీమ్ కు ధన్యవాదాలు

  • @ebunrikiran8727
    @ebunrikiran8727 Год назад +5

    సూపర్ పాట చాలా బాగుంది 👌👌👌

  • @sanamgd125
    @sanamgd125 2 года назад +92

    అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు...🙏🙏🙏🙏🙏

  • @ppranay5121
    @ppranay5121 2 года назад +15

    Nice song🔥 madhupriya ni voice super ra Chelli.And Kalyan bro super❤️❤️

  • @ashokthogari8901
    @ashokthogari8901 Год назад +5

    👌👌👌👌👌👌👌👍👍
    Best lyrics,Super music Compose And MADHU priya Super Singing Super voice