1200 సంవత్సరాల క్రితం నిర్మించిన అసాధ్యమైన హిందూ నిర్మాణం! - |ప్రంబనన్ ఆలయం|

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఇది ఇండోనేషియాలో ఉన్న, ప్రంబనన్ అని పిలువబడే అతిపెద్ద హిందూ దేవాలయం. కాదు, ఈ గంభీరమైన గోపురం ఉన్న ఈ ఆలయం మాత్రమే కాదు. అలానే ఈ 3 ఆలయాలు మాత్రమే కాదు. పక్కనే, ఉన్న 2 చిన్న ఆలయాలతో కలిపి మొత్తం ఇక్కడ 6 పెద్ద దేవాలయాలు ఉన్నాయి. నేను తమాషా చేస్తున్నాను....., ఇది దాని కంటే పెద్దది, ఆలయ సముదాయంలో దీని చుట్టూ, 218 చిన్న దేవాలయాలు ఉన్నాయి. దీని పరిమాణాన్ని మీరు నమ్మగలరా? కానీ కాదు, ఇది మొత్తం ప్రంబనన్ complex కాదు, ఒక మైలు వ్యాసార్థం వరకు, అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి, వాటిని మీరు నడుచుకుంటూ వెళ్లి కూడా చేరుకోలేరు. చాలా మంది ప్రజలు, దేవాలయాలన్నింటికీ వెళ్లేందుకు కారును తీసుకొని వస్తారు. ఇంత పెద్ద పురాతన ఆలయ సముదాయాన్ని ఊహించుకోండి, దానిలో ఉన్న అన్ని నిర్మాణాలను visit చేయడానికి, మీరు వాహనంలో ప్రయాణించాలి.
    మీరు అదే ప్రాంగణంలో, అనేక పెద్ద దేవాలయాలను చూడవచ్చు, అందుకే ప్రంబనన్ ఆలయ compoundలు UNESCO World Heritage siteగా ప్రకటించబడ్డాయి. పురాతన నిర్మాణదారులు, ఈ ప్రపంచ అద్భుతాన్ని ఎలా సృష్టించారు? నేను నా కెమెరాతో ఈ ఆలయానికి న్యాయం చేయలేను, ఎందుకంటే నేను ప్రధాన ఆలయాలను కూడా, ఒకే ఫ్రేమ్‌లో కవర్ చేయలేను కాబట్టి. మీరు దేన్నైతే, ఒంటరిగా చూస్తున్నారో, అది 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. కనీసం డ్రోన్ షాట్‌లో అయినా, నేను మీకు ఇదైనా చూపించగలుగుతున్నాను, కానీ Lumbung మరియు బుబ్రా వంటి అనుబంధ దేవాలయాలను, డ్రోన్ ఉపయోగించి కూడా చేర్చలేము. ఈ ఆలయం లోపల, ఆధునిక మనుషుల sizeను చూడండి, వారందరు ఒక పెద్ద పుట్టినరోజు కేక్‌పై చీమలు, విందు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు, కదా? నేను ఇప్పుడు మీకు 360 డిగ్రీల viewను చూపించగలను, ఇక్కడ మీరు కనీసం ఈ 8 నిర్మాణాలను చూడవచ్చు.
    కానీ, ఈ ఆలయం అడ్డంగా మాత్రమే కాదు, నిలువుగా కూడా పెద్దదిగా ఉంటుంది. ఈ వ్యక్తి ఎత్తును చూడండి అలానే ఈ టవర్ ఎత్తును చూడండి - ఇది 154 అడుగుల భారీ టవర్. And ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించుంటారు? Archeologistలు మరియు historianలు, ఈ ఆలయం దాదాపు 850 A.D లో నిర్మించబడింది, అంటే ఇది దాదాపు 1200 సంవత్సరాల పురాతనమైనదని చెప్తున్నారు, అంటే ఈ నిర్మాణం తర్వాత శతాబ్దాలు గడిచిపోవడమే కాదు, పూర్తి సహస్రాబ్ది గడిచిపోయింది. మీరు కంబోడియాలో ఉన్న అంగ్కోర్ వాట్ దేవాలయం నుండి ఇది inspire అయ్యి ఉండవచ్చని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ గుడి గోపురాలు, pinecone లాగానే ఉన్నట్లు మీరు చూడవచ్చు. కానీ, ప్రంబనన్ ఆలయం, అంగ్కోర్ వాట్ నిర్మాణానికి, సుమారు 300 సంవత్సరాల ముందు నిర్మించబడింది, కాబట్టి ఇది అంగ్కోర్ వాట్ ఆలయానికి కొన్ని శతాబ్దాల పూర్వం ఉంది.
    అంగ్కోర్ వాట్ ఆలయం, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం, కానీ ఈ ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని, అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రమే కాదు, ఇది South East Asiaలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం. కానీ ఇది కేవలం macro మాత్రమే కాదు, ఇది అద్భుతమైనది పరిమాణం మాత్రమే కాదు. ఇక్కడ చెక్కిన ఈ సూక్ష్మ వివరాలను చూడండి. నేను ఈ శిల్పాలను చూస్తూ ఎప్పటికీ నడవగలను, ఈ శిల్పాలన్నీ పురాతన గ్రంథాలలో పేర్కొన్న అద్భుతమైన సంఘటనలను తెలియజేస్తున్నాయి. మనం ఇలా మామూలుగా నడిచినప్పుడు, ప్రతి చెక్కడంలో extraordinary micro detailsను కోల్పోతాము. ఉదాహరణకు ఈ చెక్కడం చూడండి, ఇక్కడ మీరు చాలా మందిని చూడవచ్చు, కానీ ఈ 2 బొమ్మలు మాత్రమే నా కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఈ రాక్షసుడిపై బాణాన్ని వేస్తున్నాడు చూడండి, ఇది ఒక దెయ్యం అని, చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే అతని కళ్ళును చూడండి ఎలా బయటకు వస్తున్నాయో, అతని నోటి నుండి కోరలు రావడాన్ని కూడా మీరు చూడవచ్చు.
    కానీ ఈ క్రింద చూడండి, మీరు అతని కడుపులో మరొక ముఖాన్ని కూడా చూడవచ్చు. బొడ్డు మీద కూడా, అతని కళ్ళు బయటకు రావడం మరియు అతని కోరలు బయటకు రావడం మీరు చూడవచ్చు. ఈ చెక్కడం, గ్రంధాల ప్రకారం, రాముడు, కబంధ అనే రాక్షసుడితో పోరాడుతున్నట్లు చూపిస్తుంది, కానీ, ఇక్కడున్న ఈ వివరాలను చూడండి. రాముడు తన బాణాన్ని వదిలినప్పుడు, ఆ బాణం ఈ విధంగా, ఎడమ వైపు నుండి అతని శరీరంలోకి వెళుతుంది, మీరు ఈ బాణాన్ని ఇక్కడ చూడవచ్చు, కానీ మరొక వైపు చూడండి, ఈ బాణం అతని శరీరాన్ని చీల్చిన తర్వాత, దాని తల బయటకు వచ్చింది. ఇది ఒక అద్భుతమైన వివరణ, కానీ మీరు నిశితంగా పరిశీలిస్తే, ఈ భాగంలో, మీరు కొంచెం ఎలివేషన్‌ను చూస్తారు, మీరు కెమెరాతో ఇంత మాత్రమే చూడగలరు, కానీ శరీరం లోపల ఉన్న బాణం దగ్గర ఉన్న, ఈ భాగం కొద్దిగా ఉబ్బింది, అది ఉబ్బిపోతూనే ఉంది అలానే తన ఎతైన కనుబొమ్మలతో ఇది సరిగ్గా match అయింది చూడండి. మీరు ఎవరిలోనైనా బాణం వేస్తే, ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి, అది ఉబ్బిపోతుంది, సరేనా?
    పురాతన నిర్మాణదారులు, ఈ అద్భుతమైన వివరాలను చెక్కారు, కెమెరా కారణంగా మీరు దీన్ని చూడలేకపోవచ్చు, కానీ మీరు ఇక్కడకు వచ్చి, ఈ భాగాన్ని తాకినట్లైతే, మీరు ఈ ఉబ్బెత్తును గ్రహించవచ్చు. కానీ, నేను చూపించాలనుకున్నది కూడా ఇది కాదు, నేను microdetailsలో కోల్పోతున్నాను. నేను, ఈ దుష్ట పాములనే మీకు చూపించాలనుకున్నాను. ఈ దుష్ట పాములు, రాక్షసుడి శరీరం నుండి బయటకు వస్తున్నాయి, అవి దెయ్యం యొక్క ఉపకరణాలు కదా?
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia #hinduism #history

Комментарии • 96