కొత్తకొండ జాతర -2025 ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమావేశం నిర్వహించారు
HTML-код
- Опубликовано: 19 янв 2025
- TJ TV NEWS TELUGU
హనుమకొండ డిసెంబర్ 24:
కొత్తకొండ జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర జనవరి 10 నుండి 18 వరకు జరుగు శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత కళ్యాణోత్సవ ఏర్పాట్లను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండ
జనవరి 10వ తేదీ నుండి 18 వరకు జరిగే కొత్తకొండ భద్రకాళి వీరభద్ర స్వామి జాతరకు ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులు ఆదేశించారు. కొత్తకొండ భద్రకాళి ఆలయం ఆవరణలో కలెక్టర్ దేవాదాయ పోలీసు రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో జాతర పనుల ఏర్పాట్లపై సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు శానిటేషన్ పార్కింగ్ విద్యుత్తు, వైద్య, బార్కేడింగ్, దర్శనం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద డ్యూటీలు నిర్వహించే సిబ్బంది ఇంతకుముందు విధులు నిర్వహించిన విధంగా ఆ అనుభవాలతో సమర్థవంతంగా తమ విధులు నిర్వహించాలని తెలిపారు.
విధులు నిర్వహించే సిబ్బంది హోదా, వారి మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉంచాలన్నారు. విఐపి దర్శనము, కార్ పాసులను జారీ చేసేటప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుభవం కలిగిన సిబ్బంది విధులు నిర్వర్తించే విధంగా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు
కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రాథోడ్ రమేష్, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, ఆలయ ఈవో కిషన్ రావు, ఏసీపి తిరుమలరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు
-------------------------------------------