గ్రహించిన మంత్రం జపం చేయలేకపోతే ఈ విధంగా వదిలేయండి
HTML-код
- Опубликовано: 28 янв 2025
- అనేక మంది వద్ద మంత్రాలు గ్రహించి మంత్రం తీసుకున్న సమయం లో చేయడం సులభమే అనుకుని తర్వాత వారి పరిస్థితుల వల్ల గ్రహించిన మంత్రాలు సరిగా జపం చేయలేకపోతే వాటివల్ల చాలా చెడ్డ ఫలితాలు ఉంటాయి . మనం ఉద్ధరిస్తాం అని నమ్మించి గ్రహించిన మంత్ర చైతన్యాన్ని అర్ధాంతరంగా వదిలేస్తే అవి గ్రహించిన వ్యక్తి ఉనికిని బలహీన పరుస్తాయి . అందుకే గ్రహించిన మంత్రాలు మనం సాధన చేయలేకపోతే వాటిని పధ్ధతి ప్రకారం వదిలివేయడం ఉత్తమ మార్గం . ఇంతవరకు మంత్రాలు ఎలా గ్రహించాలి అని చాలామంది చెప్పినా మంత్రం త్యాగం మాత్రం సింహీ అపరాజిత లోనే ప్రప్రధమంగా తెలియజేస్తున్నాను . మంత్రాలు అందరిదగ్గరా గ్రహించకండి . గ్రహించిన మంత్రాన్ని అర్ధాంతరంగా ఆపేయకండి అలా పోషించలేని స్థితిలో నేను చెప్పిన విధంగా మంత్రం త్యాగం చేయండి . జపించని ఉద్దరించలేని మంత్రం నుండి వచ్చే దుష్ప్రభావాలకు దూరంగా ఉండండి . అహం కమలానందనాధ
శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA
#TANTRAM#SIMHEE ANGIRASA#TELUGU TANTRAM#TELUGU MANTRALU