Naa Devudave Neevani (నా దేవుడవే నీవని) Lyrical Song - 83 | Radha Krishna devotional special song
HTML-код
- Опубликовано: 5 янв 2025
- శ్రీ కృష్ణుడు అంటే యుగయుగములందు ధర్మస్థాపనకై ఉద్భవించు అవతార పురుషునిగానూ, ధర్మ గ్లాని తొలగించుటకు శరీరము ధరించు జగద్గురువుగానూ మరియు శరీర బాహ్యముగా వెలుగొందు భగవద్స్వరూపముగానే అందరికీ తెలుసును. కానీ శరీరాంతర్గతముగా ప్రతి జీవికి అత్యంత సమీపముగా జ్ఞానస్వరూపుడై విరాజిల్లుతున్న ఆత్మస్వరూపుడైన "రహస్య గురువు" అని జగతికి తెలియకుండాపోయినది.
ఆదినుండి తనతోపాటు తనువులోనే ఉన్న తండ్రిగా, భగములో ఉన్న భర్తగా, ఉదరంలో ఉంటున్న సహోదరునిగా ఆయన స్థానము అనిర్వచనీయమైనది. ఎంతో జ్ఞాన సుకృతము ఉంటేనే కానీ జీవుడు గ్రహించలేని ఆ గురు స్థానమును ఉహించుట కూడా ఒక అదృష్టమే అని చెప్పవచ్చును.
అత్యంత సన్నిహితులైన శిష్యుడైన జీవునికి, గురువైన ఆత్మకి మధ్య దూరము పెరిగిపోయినది అని తెలుసుకుని, జ్ఞానాన్వేషకుడైన ఓ జీవుడు .. తన శ్రద్ధను గురిగా మార్చి, విశ్వాసమనే విల్లుతో, గురువుపై తనకు గల హక్కుని ఎక్కుపెట్టి, ఆరాధనా అనే అస్త్రాలను సంధిస్తున్నాడు. అట్టి శ్రద్ధ కలిగిన ఆ జీవుని యొక్క ప్రేమ అనే అస్త్రాలకు తన శాస్త్రము అనే వరమును, తన బోధన అనే భిక్షను గురు దక్షతగా అందజేసి గురువు కూడా మురిసిపోతున్నాడు.
కలియోగమున అభినవ రాధాకృష్ణులుగా ఆ "గురు శిష్యుల" మధ్య కల అనురాగాన్ని, గురువుకై పరితపించే శిష్యుని ఈ అందమైన పాటలో చూసి తరిద్దాము.
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !!!
L I K E | S H A R E | S U B S C R I B E
-------------------------------------------------------
Cast - Thraitha (Radha & Krishna)
Lyricist - Siva Krishna Kogili
Singer - Surabhi Sravani
Music - N Nagesh
Still Work DOP & Editor - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
Lyrics:
----------
సాకీ :
------
కృష్ణయ్యా రారా అనీ ... వేచి వుంది బృందావనీ కన్నయ్యా రారా అనీ ... కాచుకుంది హృదయవాణి …. నా హృదయవాణి
పల్లవి :
--------
నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచిందీ మందాకినీ /2/
ఇన్నినాళ్ళ దూరం తీరాలు దాటిపోనీ నిన్ను నేను కలిసే దారుల్ని చూడనీ...
కమ్ముకుంది మైకం నిన్నింక వేడుకొనీ నమ్ముకుంది నైనం నిన్నంటి పోనని ఆ చూపులో నీ జ్ఞాన రూపు ఉందని ...
నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని… పిలిచిందీ మందాకినీ
చర 1:
------
వేదాలనే వంచు వేణువుని ... వేదాంతుడై వచ్చి ఊదమని శిరభారమే త్రుంచు శంఖముని ... గిరిధారివై పూరించమని
నవనాడిలో ఆడు శ్వాసధ్వని... నవనీతచోరుడై దోచమని మేఘావృతం కాని నా హృదిని ... జ్ఞానామృతం పంచి ఏలమని
పంచప్రాణమంతా నీ పింఛమందు చేరి పంచవన్నె కోసం నా వెన్ను దాటనీ ఫాలభాగమందే ఆ పాలపుంతలోని లీలలన్ని చూసి తరియించనిమ్మనీ ఆ లీలలో నన్ను జావళీలు పాడనీ
నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచిందీ మందాకినీ
చర 2:
--------
నీ రాతలే నాకు శాస్త్రమని .... తలరాతలే మార్చు అస్త్రమని
నీ బోధలే పంచవేదమని ... నా బాధలే తీర్చు మోదమని
నీ త్రైతమే నాకు స్వంతమని ... నీ చింతలో కర్మ అంతమని
నీ గీతలో నన్ను చుట్టుకొని ... జతకూడగా మట్టుబెట్టమని
రాగద్వేష బేధం ఇహమందు జారిపోనీ
మూగబోవు శిలనై నే నిన్ను చేరనీ
యోగమాయ సైతం గురురూపు చూపుతుంటే
భగవానుడంటే నువ్వేనని విశ్వసించనీ
ఆ ధ్యాసలో నా తుదిశ్వాస వీడనీ
Finishing
--------------
నా దేవుడవే నీవని పలికింది బృందావని
నా నాథుడవై రమ్మని పిలిచిందీ మందాకినీ
అంతులేని స్థానం నా చెంత చేర్చు జ్ఞానంనే
ఆదరించు వైనం నీ నైజమేననీ
అందరాని తీరం నాకందజేయు సారంలా
అందివచ్చు దారం నీ భావమేననీ
ఆధారమై వున్న అంతరాత్మ నీవని ....
నా దేవుడవే నీవని గోవిందుడవై పుట్టావని
ఆచార్యుడవే నీవని ఆనందుడవై వచ్చావని