అనఘావ్రతం - తెలుగులో పూజా విధానం, అర్థం Telugu Anagha Vratam Procedure and Meaning

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025
  • అనఘాష్టమి వ్రతం లేక అనఘావ్రతం అత్యంత మహిమాన్వితమైన వ్రతం. ఈ వ్రతం కష్టాలను, కలతలను, అనారోగ్యాన్ని, ఆర్ధిక సమస్యలను, కుటుంబ కలహాలను పరిష్కరించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అన్నివిధాలా రక్షణనిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచంలో జరుగనున్న అల్లకల్లోలాలనుండి మనందరినీ కాపాడటం కోసం సద్గురువు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారు ప్రతిఒక్కరినీ నియమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించమని ఆదేశిస్తున్నారు. సులువుగా, సూక్ష్మంగా దీనిని ఆచరించే పద్ధతినికూడా వివరించారు. నదీతీరంలో, సముద్రతీరంలో, జలపాతం వద్ద, సరోవరం వద్ద, గిరిపైన,, మహర్షులు నిర్మించిన దేవాలయాలలోను, మేడి, ఉసిరి చెట్ల చుట్టూ, తులసివనంలో, గోశాలలో, ఈ వ్రతాన్ని చేస్తే వందరెట్ల ఫలితం వస్తుందన్నారు. సద్భక్తులందరూ ఈ ఆదేశాన్ని అనుసరిస్తారని, తమ పాపాలను పోగొట్టుకొని, తద్వారా కష్టాలను నివారణ చేసుకుని సుఖజీవనాన్ని సాగిస్తారని, మనశ్శాంతిని, ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతారని ఆశిస్తూ శ్రీ స్వామీజీ కరుణతో ప్రజలందరికీ అందించిన ఈ మహత్తరమైన కానుకను అందరూ రెండవ ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థన. జయ గురు దత్త

Комментарии •