ఎంత గడుసు వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా.ఇలాంటిపాట ఎక్కడ విని ఉండరు.yentha gaduchu vadamma.లిరిక్స్ తో

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ఎంత గడుసు వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా
    శుద్ధసావేరి రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి.
    ఎంత గడుసు వాడమ్మ ఎన్ని నేర్చి నాడమ్మా
    అందినట్టే చేతికి అందదీ అందకుండా పోయాడమ్మా
    వెన్నల దొంగా వాడేనమ్మా యశోద మాత నీ కొడుకమ్మా.
    "ఎంత గడుసు వాడమ్మా"
    చరణం1.
    జట్టిలెన్నో తెచ్చేడు జగడమాడితే చూసేడు.
    కొంటె నవ్వులే నవ్వేడు కోర చూపులే చూసేడు.
    పిల్లడుగాడే ఓయమ్మా చిచ్చర పిడుగే వాడమ్మా
    వెన్నల దొంగా వాడెనమ్మా యశోద మాతా నీ కొడుకమ్మా.
    "ఎంత గడుసు వాడమ్మా"
    చరణం 2
    సద్దుచేయక సడిచెయ్యక గోపెమ్మల ఇళ్లలో చేరి
    కడవలలోని వెన్నమీగడలు కొసరి కొసరి తా తిన్నాడు
    ఆపిల్ల మూకకు మేపేడు అల్లరివాడే నీ కొడుకమ్మా.
    వెన్నెలదొంగా వాడే నమ్మా యశోద మాతా నీ కొడుకమ్మా
    "ఎంత గడుసు వాడమ్మా"
    చరణం 3
    పిల్లన గ్రోవిని పిడికిన పట్టి కోకలన్నియు కొమ్మకు చుట్టి
    "జలకాలాడే జల జాక్షులను....ఊ... ఊ....."2"
    పొన్నల చాటున పొంచి చూసిన
    పోకిరి వాడే నీ కొడుకమ్మా
    వెన్నల దొంగ వాడేనమ్మా
    యశోద మాతా... నీ కొడుకమ్మా
    "ఎంత గడుసు వాడమ్మా"

Комментарии • 8

  • @bhaskarnasina9845
    @bhaskarnasina9845 8 дней назад

    స్వామి గారు మీకు... ఆ భగవంతుని కృపా..కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నా...

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 4 месяца назад +1

    శ్రీ కృష్ణ పరమాత్మ కి జై..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Senuato-p5m
    @Senuato-p5m 2 месяца назад

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 4 месяца назад

    సూపర్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 4 месяца назад +1

    Jaikresh 🎉🎉

  • @ckreddydevotional
    @ckreddydevotional  4 месяца назад +1

    ruclips.net/video/4jHQCUmL0-A/видео.htmlsi=2dE5ktwH8YbnQmBZ అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. యూగానికి ఒక అవతారం దాల్చిన యుగ పురుషుడు జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్ముడు.అరుదైన ఈ పాట అద్భుతమైన సాహిత్యం తో కూడినది. విని తరించండి. కలియుగంలో హిందు సమాజం. ధర్మ మరియు భక్తి మార్గములో నడవాలనే సంకల్పంతో క్రమం తప్పకుండా ప్రతి ఉదయాన్నే కొత్త కొత్త భక్తి భజన పాటలను అందిస్తున్న ckreddy devotional ఛానల్ ను ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రయిబ్ చేసుకోవాలని విన్నవిస్తూ 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @LovelyMahesh-ey2lk
    @LovelyMahesh-ey2lk 2 месяца назад

    Nemder

  • @LovelyMahesh-ey2lk
    @LovelyMahesh-ey2lk 2 месяца назад

    Papu