- Видео 1 076
- Просмотров 1 111 783
TALATHOTI
Индия
Добавлен 3 май 2010
ఈ ఛానల్ ల్లో సాహిత్య సంబంధమైన ఎన్నో వీడియోలను మీరు తిలకించవచ్చు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన పురాణ , ఇతిహాస, ప్రబంధ కావ్యాలు,శతకాలు ఇలా ఎన్నో సంప్రదాయ పద్యకవితా ఛందస్సుకు సంబంధించిన పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా ఆలపింపజేసి ఆకట్టుకునేలా రూపొందించిన వీడియోలు...; వచన కవితలు, దీర్ఘ కవితలు, లఘుకవితా ప్రక్రియలైన మినీ కవితలు, హైకూలు, సేన్ ర్యూలు, ఫోటో హైకూ, హైగా,హైబున్, తంకా,నానీలు,రెక్కలు, కూనలమ్మ పదాలు, గజల్స్, మధ్యాక్కరలు మరెన్నో కవితా ప్రక్రియలు...; గేయాలు, జానపద గీతాలు, ప్రసిద్ధుల సాహితీ ప్రసంగాలు~ సాహిత్యోపన్యాసాలు , ప్రముఖ కవుల సాహిత్యంపై విశ్లేషణలు; ప్రముఖ కవుల - రచయితల ఇంటర్వ్యూలు, సామాజిక స్పృహతో కూడిన పాటలు, ప్రసిద్ధ సినిమా పాటలపై విశ్లేషణ, కథా సాహిత్యానికి సంబంధించిన విశ్లేషణాత్మక వీడియోలు అదీఇదీ అనిచెప్పడం కష్టం. సాహిత్యానికి సంబంధించిన వారీగా ఉత్తమ సాహిత్యాన్ని మేము అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ను మీరు Subscribe చేసుకోవడమే కాదు మీ బంధు మిత్రులకు మా channel ను పరిచయం చేసి Subscribe చేసుకోమని సిఫార్సు చెయ్యమని మనవి. ruclips.net/user/TALATHOTI
శ్రీ ఆడారి కొండలు రావు| సీనియర్ పాత్రికేయులు| డైమండ్ జూబ్లీ జన్మదినోత్సవం
జనవరి 14, సంక్రాంతి రోజు 74 నుంచి 75వ వసంతమైన డైమండ్ జూబ్లీ పుట్టినరోజు జరుపుకోనున్న సీనియర్ పాత్రికేయులు, మిత్రులు శ్రీ ఆడారి కొండలు రావు గారికి జన్మదిన, సంక్రాంతి శుభాకాంక్షలు 💐
Просмотров: 96
Видео
#గంటిజోగిసోమయాజి #వైస్_ఛాన్సలర్ #ఆంధ్రవిశ్వవిద్యాలయం #కవియోధ_తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #హైకూక్లబ్
Просмотров 4334 месяца назад
#గంటిజోగిసోమయాజి #వైస్_ఛాన్సలర్ #ఆంధ్రవిశ్వవిద్యాలయం #కవియోధ_తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #హైకూక్లబ్
#మహార్ణవం #సాహితీ సురేఖ #మల్లారెడ్డి శంకర ప్రసాద్ #తలతోటి_పృథ్విరాజ్ #కవి యోధ #కవితలతోటి #హైకూక్లబ్
Просмотров 695 месяцев назад
#మహార్ణవం #సాహితీ సురే #మల్లారెడ్డి శంకర ప్రసాద్ #తలతోటి_పృథ్విరాజ్ #కవి యోధ #కవితలతోటి #హైకూక్లబ్
మహార్ణవం అనే నా కొత్త లఘు కవితా సంపుటి ఆవిష్కరణ సభ
Просмотров 365 месяцев назад
మహార్ణవం అనే నా కొత్త లఘు కవితా సంపుటి ఆవిష్కరణ సభ
#గుంటూరు_లక్ష్మీనరసయ్య #దళిత_సాహిత్యం #బహుజన_సాహిత్యం#విమర్శకులు #తలతోటిపృథ్విరాజ్ #హైకూక్లబ్
Просмотров 415 месяцев назад
#గుంటూరు_లక్ష్మీనరసయ్య #దళిత_సాహిత్యం #బహుజన_సాహిత్యం#విమర్శకులు #తలతోటిపృథ్విరాజ్ #హైకూక్లబ్
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
Просмотров 465 месяцев назад
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
Просмотров 495 месяцев назад
వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
#చింతాదీక్షితులు #బాలసాహిత్యం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి
Просмотров 687 месяцев назад
#చింతాదీక్షితులు #బాలసాహిత్యం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి
#సయ్యద్_నశీర్_అహమ్మద్ #SayedNaseerAhmed #ముస్లించారిత్రికరచయిత #తలతోటిపృథ్విరాజ్ #ఇండియన్_హైకూక్లబ్
Просмотров 2637 месяцев назад
#సయ్యద్_నశీర్_అహమ్మద్ #SayedNaseerAhmed #ముస్లించారిత్రికరచయిత #తలతోటిపృథ్విరాజ్ #ఇండియన్_హైకూక్లబ్
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
Просмотров 658 месяцев назад
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
Просмотров 269 месяцев назад
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
Просмотров 10111 месяцев назад
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
Просмотров 52Год назад
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
Просмотров 66Год назад
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
Просмотров 244Год назад
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
Просмотров 146Год назад
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
Просмотров 785Год назад
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
Просмотров 89Год назад
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
Просмотров 113Год назад
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
Просмотров 305Год назад
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
Просмотров 78Год назад
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
Просмотров 95Год назад
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
Просмотров 78Год назад
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
Просмотров 235Год назад
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
Просмотров 138Год назад
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
Просмотров 44Год назад
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
Просмотров 148Год назад
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
#అనంతామాత్యుడు #భోజరాజీయము #పద్యకవిత్వం #indianhaikuclub #talathotiprithviraj
Просмотров 172Год назад
#అనంతామాత్యుడు #భోజరాజీయము #పద్యకవిత్వం #indianhaikuclub #talathotiprithviraj
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
Просмотров 134Год назад
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
Adbhutha gatram sir🙏🙏🙏
అందరికీ 'కనుమ' పండుగ శుభాకాంక్షలు 💐 Kanuma Festival _ Talathoti Prithvi Raj Haiku (1) పూజలందుకుంటూ రైతులచే పశువులు-నాయకుల ఛీత్కారాలతో రైతులు! (2) ఇత్తడి కుప్పెలు, కొత్త పగ్గాలు మువ్వల పట్టీలు, మూజంబరాలు : పశువుల అలంకరణ కనుమ (3) వరికంకుల తోరణం. రైతు భాగస్వామి పక్షులకు కనుమ స్వాగతం! (4) కోడెద్దులు యజమాని గౌరవం పెంచాయి ఎడ్లపందెం గెలుపుతో! (5) పతంగాలతో ఆకాశం బాల్యం కేరింతలతో మైదానాలు- సంక్రాంతి అందాలు (6) కనుమ: మూగజీవాల వ్యధనూ, వధనూ కనుము #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #kanuma
Sankranti Haiku | Talathoti Prithvi Raj | Indian Haiku Club | Anakapalle (01) సంక్రాంతి సెలవులు స్కూల్ పిల్లలకే కాదు- రైతు నేస్తాలకూ! (02) కళ్ళాపి, ముగ్గులు గొబ్బెమ్మలతో పల్లె వీథులు: ఆ కొస ఇంటికెలా వెళ్ళను? (03) హరినామ సంకీర్తనలు: వేకువ చీకటి మంచులో ఇంటింటికి హరిదాసు (04) అక్షయ పాత్రలోని వివిధ వంగడాల బియ్యంలా- ఒకటిగా ఉందా దేశజనాభా!? (05) గంగిరెద్దులోడి సన్నాయిలోంచి కొత్త సినిమాపాట- చెవులు రిక్కించి జనం (06) డూడూ బసవన్న: అధిష్టానంకు తలాడించే అధికారి గుర్తుకు... (07) కత్తుల్తో కోడిపందాలు: విధిఆట ఆడే దేవుడ్నిమాత్రం నిందిస్తూ మనుషులు (08) రోమ్ గ్లాడియేటర్ నుండి కోడిపందేల శిబిరాల వరకు: మనిషిలో చావని క్రూరత్వం (09) రైతుల పండుగరోజూ అదేదోచోట అప్పులతో - ఓ రైతు ఆత్మహత్య! (10) అస్పృశ్యతాపోషకులూ- హరిదాసులు మాలదాసరులని తెలిసేనా స్పర్శకు దూరం? (11) పండుగ పిండివంటల రుచి ఆత్మీయ బంధువులరాక, ప్రేమ ఆప్యాయతలే కదూ! (12) కోడిపందాల శిబిరంలో సంస్కృతి చట్టం ముసుగుతో జూదలన్నీ జొరబడ్డాయి! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #sankranthi
ఆహా! ఆహాహా.! కర్ణామృతమే... _____ సందియము లేదు
గొప్ప ప్రయత్నం
వంగపండు ప్రసాదరావు గారి పాటలు నాకు చాలా ఇష్టం❤❤❤
అందరికీ 'భోగి' పండుగ శుభాకాంక్షలు 💐 Bhogi Festival _ Talathoti Prithvi Raj Haiku (1) భోగిమంటల్లో పాడైన పడకకుర్చీని వేయలేదు- అది నాన్నజ్ఞాపకం! (2) శీతాకాలమంతా రోజూ భోగిమంట పక్షులకు- ఉదయభానుడు (3) పిల్లల శిరస్సుపై పెద్దల దీవెనల అభిషేకం - పూలు,శనగలు, భోగి పండ్లు (4) బొమ్మల్లో కలిసిపోయి కొన్ని సజీవ బొమ్మలూ: బొమ్మల కొలువు (5) ఇచ్చిపుచ్చుకునే పేరంటం వాయనం - మానవతలో తప్ప! (6) దక్షిణాయనం: దూరమైతే చలి, దగ్గరైతే వేడి సూర్యుడి ఇంద్రజాలం #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #bhogi
❤
కృష్ణడు దుర్యోధనునితో పలికే మాటలలో "భీష్మడు" కు బదులుగా పద్యములో "భీముడు" అనే ఉచ్చారణ వచ్చింది పరిశీలించగలరు.
విశ్లేషణ అంతా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు
పొంత అంటే అర్థం, మట్టితో చేసిన ఒక పెద్ద కుండ, పాతకాలం రోజుల్లో మన ఇళ్ళ దగ్గర మూడు వైపు రాళ్లు పెట్టి అన్నం వండుకుంటారు, ఆ మూడు వైపులా ఒకవైపు రాయి తీసి ఈ నీళ్లతో నింపిన కుండను పెడతారు, అలా పెట్టి వంట చేసేటప్పుడు ఆ వంటతో పాటు ఆ మంటకి కుండలో ఉన్న నీళ్ళు కూడా వేడి అవుతాయి ,వాటిని స్నానానికి ఉపయోగిస్తారు ,అలా పొయ్యి దగ్గర మూడో వైపు ఉపయోగించిన కుండని పొంత అంటారు
ఇవటూరి గౌరీశం గారూ మీకు నా అభినందనలు. మీ స్వరం అద్భుతం. పద్య గానం అమోఘం. శ్రీ కర్రి నాగార్జున శ్రీ అనే తెలుగు సహాయ ఆచార్యులు ( పూర్వ ఆశ్రమం లో ఒక పాఠశాల తెలుగు పండితులు) రాజమండ్రి లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన మాతో కలిసి పనిచేశారు. ఆయన పద్యాలు మాకు చాలా మధురం అనిపించేవి. అంత సంతోషం ఇప్పుడు నాకు కలిగింది. మీరు అల్లసాని పెద్దన గారి ఉత్పల మాలిక పద్య గానం చేసి పండితులను , పామరులను అలరింప చేయ ప్రార్థన. కర్రి నాగార్జున శ్రీ వసు చరిత్ర కావ్య గానం రాజమహేంద్రి నగరం లో Dr. C. నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించిన సభ లో కావ్య గానం చేసిన సందర్భం గుర్తుకు వచ్చింది. ధన్యవాదాలు. తిరుపతి ధన్వంతరి సూరి మొబైల్ నంబర్ 9705657704 B.A. B.Ed., retired PSHM
Excellent
లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను; మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్, నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్, రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!, (బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని 90 వ పద్యం. ) మొసలి చేత చిక్కబడి, తననుతాను విడిపించుకునే ప్రయత్నంలో అలసి సొలసి చివరికి నీవే నన్ను రక్షించాలి స్వామి అని గజరాజు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నట్లు పోతన రాసిన ఈ పద్యంలోని గజరాజును పిటీషనర్ గా, మొసలిని రెస్పాండెంట్ లాయర్ గా, విష్ణుమూర్తిని న్యాయమూర్తిగా, మడుగును న్యాయస్థానానికి ప్రతీకగా భావిస్తూ నేటి న్యాయవ్యవస్థకు అన్వయించి చెబితే ఇలా ఉంటుంది: 'లావొక్కింతయు లేదు' అన్వయింపు: లావు అంటే బలం, శక్తి దీన్ని న్యాయ పరిభాషకై విరిచితే- లా (Law) 'న్యాయం' కాస్తంత కూడ లభించడంలేదు. (ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానం) 'ధైర్యము విలోలంబయ్యెఁ;' అన్వయింపు: న్యాయంకోసం కోర్టు మెట్లెక్కి నాకు, విలోలంబయ్యెన్ అంటే ధైర్యం పూర్తిగా చెదిరిపోయింది... న్యాయం పొందేందుకు ఎన్ని సంవత్సరాలు కోర్టుకు వెచ్చించాల్సి ఉంటుందోనని! 'బ్రాణంబులున్ ఠావుల్ దప్పెన్'అన్వయింపు: న్యాయంకోసం కోర్టు మెట్లెక్కిన నాకు వాయిదాలతో పంచప్రాణాలు తమతమ స్థానాలను కోల్పోయాయి. 'మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్' అనచవయింపు: న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన నాకు మూర్ఛవచ్చెన్ అంటే స్పృహకోల్పోయే స్థితి వచ్చింది. తనువున్ అంటే శరీరం కూడా డస్సెన్ అంటే అలసిపోయింది. శ్రమంబు + అయ్యెడిన్ అంటే కష్టం కూడా కలిగింది. 'నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్' అన్యయింపు: న్యాయస్థానంతప్ప అంటే న్యాయమూర్తికాకుండా, ఇతఃపరంబెరుగ అంటే వేరొకరిని ఎరుగను. దీనునిన్ అంటే దైన్యము పొందిన నన్ను, మన్నింపందగున్ అంటే ఆదరించు. 'రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా' అన్వయింపు: ఈశ్వర అంటే న్యాయమనే ప్రపంచాన్ని పాలించే న్యాయాధిపతీ, రావే అంటే రమ్ము. వరద అంటే తీర్పు అనే దానం చేసేవాడా. కావవే అంటే కాపాడు. భద్రాత్మకా అంటే తీర్పుతో మంచిని కలిగించే మనసుగల ఓ న్యాయాధిపతి! సంరక్షించు అంటే... నన్ను ఈ కోర్టు బంధకాలనుండి రక్షించు అని తాత్పర్య భావం ~అన్వయింపు భావం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
*న్యాయస్థానాల్లో సంస్కరించదగినవి ఎన్నో... *కొందరుకారణంగా న్యాయవాదులపై ఆశ్రితులకు సదాభిప్రాయం లేదనడం సత్యదూరం కానేకాదు! *ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కు కాని లాయర్లు మన న్యాయస్థానాల్లో లేరంటారా? *ఒక పిటీషనర్ కేసు మధ్యలో తన ఫైల్ తీసుకున్నాడంటే ఆ లాయర్ సబ్జెక్ట్ లేనివాడైన, అమ్ముడుపోయినోడైనా ఉండాలి! *కేసుల జాప్యానికి న్యాయవాదులకంటే వాయిదాలిచ్చే న్యాయమూర్తులే కారణం! *కోర్టులు వాయిదాల పరిమితిని నిర్ణయించాలి *విఐపిలు, సెలబ్రెటీల కేసులకు ఇచ్చే ప్రాధాన్యతే సామాన్యుల కేసుల పరిష్కారానికీ ఇవ్వాలి ! *దైవసమానంగా భావించే న్యాయమూర్తులపై న్యాయస్థానాల పనితీరు ఆధారపడి ఉంది! *ఆన్ లైన్ విధానంవల్ల లాయర్లు, న్యాయమూర్తులు... వెరసి న్యాయవ్యవస్థ పనితీరును ప్రజలు గమనిస్తున్నారు! *సత్యమేవ జయతే... ధర్మో రక్షతి రక్షితః ~ Dr Talathoti Prithvi Raj
ఏదో ఒక విషయంలో కోర్టును ఆశ్రయించిన వారు ఈ పద్యంతో కనెక్ట్ అవుతారు. నేటి భారతదేశ న్యాయవ్యవస్థలో కోర్టును ఆశ్రయించిన వారి మనో దర్పణం ఈ పద్య భావం అన్వయింపుతో! మహాభారతలో18 పర్వాలే! న్యాయభారతంలో వగతెగని వాయిదా పర్వాలు!! ఒక్కో పిటీషనర్ ది ఒక్కో వ్యధ, ఒకో కథ! సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరైతె, న్యాయం పొందేలోపు పరమపదించేవారు మరికొందరు. అక్రమార్కులు , దుర్మార్గుల దురాగతాలను నిరూపించి సమాజం ముందు తీర్పు కాపీ అనే చరిత్రపుటల్లో చరిత్రహీనులుగా నిలబెట్టేందుకు ఎంత సమయం పట్టినా పోరాడేవారు మరికొందరు. నేను మూడో రకం. న్యాయస్థానం మెట్లెక్కిన పిటీషనర్సు పరిశీలనలో ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కై పోయిన పిటీషనర్ లాయర్. ప్రత్యర్థి లాయర్ ఉద్దేశపూర్వకంగా కేసును సాగదీసేందుకు, కేసును వాదించి గెలిచే సత్తాలేక, ఆ కేసులో విషయంలేక పదేపదే వాయిదాలు అడుగుతుంటే నియంత్రించకుండా ఇస్తూపోయే న్యాయమూర్తులు. కేసు స్వీకరిస్తూ ఫీజు తీసుకునేటప్పుడు ఉండే లాయర్ పలకరింపు కేసు పురోగతి గూర్చి పిటీషనర్ తన లాయర్ కు ఫోన్ చేసినప్పుడు స్పందించకపోవడం. వీరి తలలోదూరినట్లు వీరి జూనియర్స్. క్లైంట్ లు వ్యక్తీకరించక పోవచ్చు. కాని ఇతరులవద్ద సదరు లాయర్ తీరును ఎండగడతాడనేది న్యాయవాదులు గ్రహించాలి. ~ Dr Talathoti Prithvi Raj
❤❤❤❤❤
ధన్యవాదములు
చాల చక్కగ పాడారు ❤
Exlent. I like it.
Ji vanga pandu garu❤
Very excellent sir
Super sir
నిన్న తను నవ్వింది...ఈరోజు తిను మాటలు చేవిక్కక్కటం లేదు...తను,తిను వేరు అని తెలిస్తే ...చ్చచ్చమ్రా బాబు..
Ayyo Sir, హైకు ku హద్దులు లేవు ...హద్దులు కవిత్వాలు కి, కావ్యలకి ఉన్నాయి...అలవోకగా మనసుకు తట్టేవే వే హైకూ లు...అవి పూర్తి గా వ్యక్తిగతం
New Year 2025 Haiku, నూతన సంవత్సరం . న్యూ ఇయర్ హైకూలు by డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ (1) పూరిగుడిసె వాకిట్లో రంగుల న్యూ ఇయర్ ముగ్గు- మంచుపోతలో మరింత అందంగా! (2) పాత - కొత్త సంవత్సరాల వీడ్కోలు - ఆహ్వాన వేళల - వొంపుసొంపుల జాబిలి (3) పక్షులకేంతెలుసు కొత్త సంవత్సరంరోజని- ఎప్పట్లాగే గడిపాయి! (4) పట్టరాని సంతోషం: మరో సంవత్సరంలోకి వయోవృద్ధుడు (5) నిర్లక్ష్య కారణమేకదూ మునుపు విత్తినవి మొలకెత్తలేదు: మళ్ళీ నూత్నతీర్మానాలు (6) సంవత్సరాంతపు అర్ధరాత్రి: ఫుట్ పాత్ పై గాఢనిద్రలో నిరాశ్రయులు రోడ్లపై కేరింతల్లో యువత! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
అద్భుతమైన వీడియో గానామృతం బహు చక్కగా ఉంది. ధన్యవాదాలు ❤
Guruvugariki padabivandanamulu
Chala Baga padaru
Thank you sir for your kind presentation
Thanks a lot sir
ruclips.net/video/uIXo_xzySBA/видео.htmlsi=EAjL2bSBhoSTOOB_
Memu ramabaanam poolu antamu sir
అద్భుత గానం
పృథ్వి "పున్నాగ పూలు" హైకూలు. పున్నాగ పూలను ఇష్టపడనివారెవరు? అందునా బాల్యంలో మనకు బాగా పరిచితం! (1) తలెత్తి చూస్తుంటే - మెల్లగా సుడులు తిరుగుతూ నాపై రాలింది ఓ పొన్నాగ పూవు! (2) ఎలా వెళ్ళగలను రాలిపడ్డ పున్నాగపూలను కొన్నైనా ఏరుకోందే! (3) శరదృతువు: తెలతెల్లగా జాబిలి, వెన్నెల పున్నాగపూలు... (4) నేలతల్లి బోసిగా ఉండడం ఇష్టంలేక చెట్టు- పున్నాగపూలుపరిచింది (5) పీ... పీ అంటూ పిల్లల సన్నాయి నొక్కులు : పున్నాగపూలు (6) కోర్కెలు సిద్ధించినట్టే. శివుడికి పున్నాగపూల లంచం సమర్పించారుగా! (7) పున్నాగ పూలసుగంధం: ఎవరో కుట్రచేసి మల్లెలకు ప్రథమస్థానం కట్టబెట్టారు! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
సాహితీసాగరంలో అప్పుడప్పుడు యిటువంటి పద్యరత్నాలు గోచరిస్తుంటాయి. గౌరీశంగారి గాత్రం శ్రవణానందం.
👍👍👍
Mahanu bavulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I'm quite delighted by listening to your voice. You are blessed with ❤so beautiful voice!
చాలా బాగా ఉంది
అద్భుతం
అద్భుతం
Veryveryveryveryxelentvoice
Super sir ❤
శ్రీశ్రీ గారు చెప్పినట్లు కాదేదీ కవితకనర్హం అన్నట్లు... హైకూ కవితా వస్తువులలో రుతువులు, ప్రకృతి, దేశ సంస్కృతి- సంప్రదాయాలు, మానవ ఉద్వేగాలు ఇవన్నీ. పెళ్ళిపై నేను రాసిన ఈ హైకూలు మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తూ.... డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ (1) ఓ చీమల్లారా! జీలకర్ర- బెల్లం పసిగట్టి దారికట్టకండి! (2) శీతాకాల పెళ్లి ముహుర్తం. మంగళవాద్య సంగీతం కొంకర్లు పోతుంది (3) ఆకాశంలో కాంతిపూలు విరబూస్తూ మాయమౌతున్నాయి: బాణసంచా (4) అర్థరాత్రి పెళ్లి ముహుర్తం: ఇళ్ళల్లోని గురకరాయుళ్ళనుసైతం కలవరపెట్టే బాణసంచా! (5) లక్షల కట్నం తీసుకునికూడా గొడవపడుతున్నాడు వరుడితండ్రి- పురోహితుడి సంభావనలో... (6) తెల్లారి పెళ్లి ముహుర్తం: బంధు మిత్రులు కుర్చీలలో కునికిపాట్లు (7) పెళ్ళి పందిరిలో బుద్దిగా పరీక్షలకు కూర్చున్నట్లు ఓ విద్యార్థి: చదివింపులు (8) అమ్మాయితండ్రి పెళ్ళికి చేసిన అప్పులు ఇంకా తీరకముందే - పాపం... విడాకులు! (9) పూలతో అలంకరించిన పెళ్ళి మండపం పరిమళిస్తోంది: జీవితం పూదోట (10) మబ్బులాకాశంలో అరుంధతి నక్షత్రం కనిపిస్తున్నట్లు చూపే పురోహితుడు, చూసినట్లే నూత్న వధూవరులు! (11) పెళ్ళి విందు ప్రారంభం. మెల్లిగాపోగైన వీథికుక్కలు కాట్లాట ప్రారంభించాయి (12) జంట ఈడూ జోడు కంటే పెళ్ళి విందుభోజనం గూర్చి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
❤
Great 👍
బహు వీనుల విందు
తెలుగు భాషతియ్యదనం అందరికీ పంచుచున్న మీకు ధన్యవాదాలు
O. Yamma. Née. Kumarudu